navageetam.com
Newspaper Banner
Date of Publish : 26 May 2026, 2:59 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

విఈవో కార్మికుల కనీస వేతనం రూ.26 వేల పెంచాలి

ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

సిపిఐ మండల కార్యదర్శి యామాల గోపాలరావు

నవగీతం: వైరా ప్రతినిధి

రాష్ట్రంలో పెరుగుతున్న ధరలకు అనుకూలంగా వేలాదిమంది కార్మికులు కనీస వేతనం అందక అనేక ఇబ్బందులుకు గురి అవుతున్నారు వారి కనీస వేతనం రూ.26 వేలు పెంచి ప్రభుత్వం వెంటనే వివో ల కార్మికులను ఆదుకోవాలని సిపిఐ వైరా మండల కార్యదర్శి యామాల గోపాలరావు డిమాండ్ చేసినారు వైరాలో గత ఐదు రోజుల నుండి వివో లు రిలే నిరాహార దీక్షలు చేస్తున్న ప్రభుత్వం వారి సమస్యల పరిష్కరించడంలో చిత్తశుద్ధి చూపించటం లేదని తీవ్రమైన ఎండలలో 50 డిగ్రీలు చూపిస్తున్న వారు టెంట్ల వద్ద నుండి లేవకుండా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూనే ఉన్నారని వారు అన్నారు ఎన్నికల హామీలలో ప్రభుత్వం సంఘటిత అసంకటి వీఇవో గ్రామపంచాయతీ వర్కర్లను రెగ్యులర్ చేస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు కన్నెత్తి వారి వైపు చూడకుండా ఉండటం సరైనది కాదని అన్నారు విఇఓ లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారి డిమాండ్ చేసినారు ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి మూటకొండ ఏఐటిసి మండల కార్యదర్శి గారపాటి అశోక్ కొండా రామకృష్ణ తదితరులు పాల్గొని దీక్షలకు సంఘీభావం తెలిపినారు