navageetam.com
Newspaper Banner
Date of Publish : 01 May 2026, 3:51 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

వేసవి కరాటే శిక్షణ క్లాసులు ప్రారంభించిన ఎంఈఓ

నవగీతం, వైరా ప్రతినిధి

ఖమ్మం జిల్లా వైరా పట్టణం ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న వేసవి కరాటే శిక్షణ తరగతులను ఎంఈఓ కొత్తపల్లి వెంకటేశ్వర్లు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎంఈఒ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కరాటే మాస్టర్ రఘు ఆధ్వర్యంలో ఇండోర్ స్టేడియం వైరా నందు నిర్వహిస్తున్న వేసవి కరాటే శిక్షణ క్లాసులు మే 1 నుండి జూన్ 10 వరకు ఉదయం 6:30 నుండి 7:30 నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కరాటే శిక్షణనను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సెలవు దినాల్లోనూ పిల్లలకు ఉచితంగా కరాటే నేర్పించి టోర్లమెంటులలో పాల్గొని పిల్లలు చిన్న వయసులోనే అనేక పథకాలు సర్టిఫికెట్లు గెలుచుకోవడానికి సహాయ సహకారాలు అందిస్తున్న రఘు మాస్టర్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో అంజద్ పాషా నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ శిక్షణ తరగతుల గురించి మరిన్ని వివరాల కోసం 9704703613 ఫోన్ నెంబర్ ను సంప్రదించాలని కోరారు.