navageetam.com
Newspaper Banner
Date of Publish : 06 May 2026, 8:45 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో రైతు వారోత్సవాలు

నవగీతం, వైరా ప్రతినిధి:

వైరా వ్యవసాయ మార్కేట్ ఛైర్మన్ బోళ్ళ గంగారావు ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు రైతు వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ బోళ్ళ గంగారావు మాట్లాడుతూ..రైతు పక్షాన శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ నాయకత్వంలో రైతులకు అనేక సంక్షేమ పథకాలు అందించడంతో పాటు రాష్ట్రప్రభుత్వం రైతు బాంధవుడుగా రైతే పరమావధిగా భావించి ముందుకు సాగుతోందని, రైతుకు చిన్న ఇబ్బంది కలగకుండా రాష్ట్ర ప్రభుత్వంతో అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం తీకుతున్న ప్రతి కార్యక్రమమని ఎమ్మెల్యే రాందాస్ నాయక్ రైతులకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు అన్నారు.ఈ కార్యక్రమంలో ఏ ఎం సీ సెక్రటరీ మోసిన్ సుల్తానా, వ్యవసాయ శాఖ అధికారి ముజమున్ ఖాన్, మండల ప్రజా పరిషత్ అధికారి సక్రూ నాయక్, వైరా సొసైటీ సీఈవో రామకృష్ణ, నాయకులు వైరా మున్సిపల్ వైస్ చైర్మన్ కట్ల సంతోష్, ఖమ్మం జిల్లా డాక్టర్స్ సెల్ అధ్యక్షులు డాక్టర్ కాపా మురళి కృష్ణా, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి పమ్మి అశోక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్స్, మోత్కురి వెంకటేశ్వర రావు, జాలాది తిరుపతిరావు, కాశీమళ్ళ వెంకటేశ్వర్లు, రేచర్ల సత్యం, రేచర్ల మల్లేశ్వరి, రైతులు తదితరులు పాల్గొన్నారు.