శభాష్ లతీఫ్ బాయ్ – మాజీ ఎంపీ నామ అభినందనలు
నవగీతం వైరా ప్రతినిధి: గర్భిణీ స్త్రీల టెస్ట్‌ల కోసం అలాగే డెలివరీ సమయాల్లో ఉచితంగా తన ఆటోలో తీసుకెళ్లి హాస్పిటల్‌కు చేర్చుతున్న లతీఫ్‌ను బీఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు శభాష్ లతీఫ్ బాయ్ అంటూ అభినందించారు. మారుమూల గ్రామాల్లో బస్సు సౌకర్యం లేని ప్రాంతాల్లో ఆయన చేస్తున్న సేవలు ప్రశంసనీయమని నామ తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన సమయంలో కూడా ఖర్చును పట్టించుకోకుండా, తన పంక్చర్ షాప్‌ను నడుపుతూ అవసరమైన వేళల్లో సేవలు అందించడం...