శాంతి సామరస్యాలతో బక్రీద్ జరుపుకోవాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
నవగీతం, జగిత్యాల ప్రతినిధి : బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా ముస్లిం సోదర, సోదరీమణులకు ఎస్పీ అశోక్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర పండుగను శాంతి, సామరస్య వాతావరణంలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా జగిత్యాల, కోరుట్ల ప్రాంతాల్లోని పలు ఈద్గా మైదానాలను ఎస్పీ స్వయంగా సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన భద్రతా, బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ప్రార్థనలకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ…“బక్రీద్ పర్వదినాన్ని ప్రజలంతా...