సమాచార హక్కు చట్టం అమలులో పారదర్శకతే ప్రధాన లక్ష్యం
జగిత్యాల కలెక్టరేట్‌లో పీఐఓలు, ఏపీఐఓలకు ఆర్‌టీఐ అవగాహన సదస్సు నవగీతం, జగిత్యాల ప్రతినిధి : ప్రభుత్వ యంత్రాంగంపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తూ పారదర్శకత, జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడమే సమాచార హక్కు చట్టం ముఖ్య ఉద్దేశ్యమని రాష్ట్ర సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్ డాక్టర్ జి. చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం జగిత్యాల జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమాచార హక్కు చట్టం–2005పై పీఐఓలు, ఏపీఐఓలు మరియు వివిధ శాఖల అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ జి....