నవగీతం, కోరుట్ల ప్రతినిధి:
కోరుట్ల మున్సిపల్ కమీషనర్ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు కోరుట్ల పట్టణంలోని కిరాణా దుకాణాలు, కూరగాయ దుకాణాలు మరియు టిఫిన్ సెంటర్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి వారు వినియోగిస్తున్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ స్వాధీన పరుచుకొని 10200/- రూపాయలు జరిమానాలు విధించడంతో పాటు బట్ట సంచుల వాడకంపై అవగాహన కల్పించడం జరిగింది.అలాగే ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చెయ్యని దుకాణా దారులకు ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలని చెప్పడం జరిగింది.దీనిని ఉదేశించి మున్సిపల్ కమీషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిస్థాయిలో నిషేదించాలి లేనియెడల భారీ జరిమానాలు విధించడంతో పాటు దుకాణాలు సీజ్ చేయడం జరుగుతుంది మరియు ట్రేడ్ లైసెన్స్ లేని వారు వెంటనే తీసుకోవాలి అని ఆయన తెలపడం జరిగింది. వ్యాపార కార్యకలాపాలతో వెలువడిన చెత్తను తడి, పొడి,హానికరక చెత్తగా వేరు చేసి షాప్ వద్దకు వచ్చే మున్సిపల్ వాహనాలకు అందించాలని తెలిపారు లేనిచో SWM-2019 చట్టం ప్రకారం జరిమానా విధించబడును.ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్లు రాజేంద్రప్రసాద్ , ఇంచార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్, రికార్డ్ అసిస్టెంట్ జగదీష్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మహేష్, జవాన్లు విష్ణు వర్ధన్ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
