వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి ఘన సత్కారం..
నవగీతం, హైదరాబాద్ :
తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి (TGWWC) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ అలీం జైద్ మంగళవారం హైదరాబాద్ బేగంపేటలోని ప్రజాభవన్‌లో నిర్వహిస్తున్న ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ని సందర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి, అభినందనలు తెలిపారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తున్న అలీం జైద్ సేవలను ఈ సందర్భంగా మంద భీంరెడ్డి కొనియాడారు.గల్ఫ్ ప్రవాసీయుల హక్కుల కోసం, వారి కుటుంబాల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని భీంరెడ్డి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఈ సత్కార కార్యక్రమంలో ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ హెల్ప్ డెస్క్ లైజన్ ఆఫీసర్ భార్గవి నద్దునూరితో పాటు వాలంటీర్లు మహ్మద్ బషీర్ అహ్మద్, కర్రి పద్మారాణి, భవాని శ్రీమాసారం తదితరులు పాల్గొని అలీం జైద్‌కు శుభాకాంక్షలు తెలిపారు.