navageetam.com
Newspaper Banner
Date of Publish : 02 May 2026, 4:17 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు ముందుకు రావాలి.

నవగీతం,ఇల్లంతకుంట ప్రతినిధి:

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని, గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సిరిసిల్ల రూరల్ సీఐ నాగేశ్వరరావు సూచించారు. మండలంలోని రహీంఖాన్ గ్రామంలో అలయన్స్ క్లబ్ ఆఫ్ రహీంఖాన్ పేట ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన శనివారం రోజున ‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో నేరాలను నియంత్రించడానికి, శాంతి భద్రతలను కాపాడడానికి సీసీ కెమెరాలు అవసరమని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా నేరాలను నియంత్రించడం, అనుమానాస్పద కదలికలను గుర్తించడం జరుగుతుందన్నారు. వేసవికాలం దృష్ట్యా ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాల నిర్వహణ, సీసీ కెమెరాల ఏర్పాటుకు అలయన్స్ క్లబ్ వంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని అని అన్నారు.ఇటువంటి చర్యలు సమాజంలో భద్రతా భావాన్ని పెంచడంతో పాటు, సామాజిక బాధ్యతను పెంపొందిస్తాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో అలయన్స్ క్లబ్ ఆఫ్ రహీంఖాన్ పేట ప్రెసిడెంట్ గడ్డమీద శ్రీనివాస్, జోనల్ చైర్మన్ పురోహితులు అల్లాడి ఆనంద్ కుమార్, ఎస్ఐ సిరిసిల్ల అశోక్, సర్పంచ్ కమటం లావణ్య రాములు, ఉప సర్పంచ్ గడ్డమీద పద్మ, క్లబ్ సభ్యులు దొంతి కిరణ్, గడ్డమీద ప్రశాంత్, ట్రెజరర్ దొంతి అశోక్, పిఆర్ఓ కమటం పరుశరాములు, ముదిరాజ్ సంఘ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.