నవగీతం,కోరుట్ల ప్రతినిధి:
పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా కోరుట్ల మండలం పైడిమడుగు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ డా.రఘు ఆలయాన్ని సందర్శించి శ్రీ ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బడుగు బూమేష్, ఉపసర్పంచ్ గాంధారి సుజాత శ్రీనివాస్, వార్డు సభ్యుడు ఆకువత్తిని నిరంజన్, చెలివేరి సురేష్, అంకం ప్రకాష్, మామిడాల భూమేశ్వర్, మాలధారణ చేసిన స్వాములతో కలిసి భక్తి శ్రద్ధలతో స్వామివారికి సేవలందించారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో డా.రఘు పాల్గొని భక్తులకు స్వయంగా ప్రసాదం పంపిణీ చేశారు.