navageetam.com
Newspaper Banner
Date of Publish : 16 May 2026, 12:10 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

16వ వార్డులో నూతన పైప్‌లైన్ పనులు ప్రారంభం

నవగీతం,కోరుట్ల ప్రతినిధి :

పట్టణంలోని 16వ వార్డు పరిధిలో గల తెలంగాణ టిఫిన్ సెంటర్ ఆవరణలో గత కొంతకాలంగా వేధిస్తున్న మిషన్ భగీరథ నీటి కొరతను అధిగమించేందుకు ముమ్మర ప్రయత్నాలు మొదలయ్యాయి.నీరు అందక ఇబ్బందులు పడుతున్న ప్రజల సౌకర్యార్థం, హైవే లైన్ నుండి వార్డుకు అనుసంధానంగా కొత్త లైనింగ్ (పైప్‌లైన్) పనులను శుక్రవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ పొట్ట సురేందర్ మాట్లాడుతూ.. వార్డులో నీటి ఎద్దడి లేకుండా చూడడమే తమ ప్రాధాన్యతని, ఈ కొత్త లైన్ ద్వారా ప్రతి ఇంటికి సరిపడా నీరు అందుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సమస్యను గుర్తించి వెంటనే స్పందించి, పనులకు సహకరించిన మున్సిపల్ కమిషనర్ , డి.ఈ మున్సిపల్ సిబ్బందికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వార్డులోని పెద్ద మనుషులు, స్థానిక ప్రజలు మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.