42 ఏళ్ల తర్వాత తెలుగు పరీక్ష రాసిన మాజీ మావోయిస్టు నేత దేవ్ జీ

విప్లవం నుంచి విద్య వైపు… ఒక జీవిత యాత్ర (కాలగిరి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్) నవగీతం, జగిత్యాల: సాధారణంగా పరీక్షా హాల్లో కనిపించేవారు యువ విద్యార్థులే. భవిష్యత్తు కోసం కలలు కనే కుర్రాళ్లు, ఉద్యోగాల కోసం పోటీ పడే యువత. కానీ జగిత్యాల జిల్లా కోరుట్లలో బుధవారం జరిగిన ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షా కేంద్రంలో కనిపించిన ఒక వ్యక్తి మాత్రం అందరి దృష్టిని ఆకర్షించాడు. ఒకప్పుడు అడవుల్లో తుపాకీతో తిరిగిన మాజీ మావోయిస్టు అగ్రనేత… నేడు పెన్నుతో పరీక్ష రాయడానికి పరీక్షా...