ఎరువుల గోదాంలు విక్రయ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ బి. సత్యప్రసాద్

నవగీతం,జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లాలో రైతులకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు.బుధవారం జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామం లోని పీఏసీఎస్ ఆధ్వర్యం లో నిర్వహిస్తున్న ఎరువుల విక్రయ కేంద్రాన్ని కలెక్టర్ బి. సత్యప్రసాద్ అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా యూరియా అప్ ద్వారా విక్రయాలను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ..రైతులకు కావలిసిన యూరియా నిల్వలు జిల్లాలో అందుబాటులో ఉన్నాయని అన్నారు. అప్ ద్వారా యూరియా బుక్ చేసుకుని కొనుగోలు...