బీ.ఎల్.ఓ.లు విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలి: కలెక్టర్ బి.సత్య ప్రసాద్
నవగీతం, జూన్18,(జగిత్యాల ప్రతినిధి):
ఎస్.ఐ.ఆర్. ప్రక్రియ బీ.ఎల్.ఓ.లకు శిక్షణ కార్యక్రమం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక సమగ్ర పునర్విమర్శ (ఎస్‌ఐఆర్) కార్యక్రమానికి సంబంధించిన బూత్ స్థాయి అధికారుల (బీఎల్‌ఓలు) శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ గురువారం పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..ఎన్నికల ప్రక్రియలో బీఎల్‌ఓల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర పునర్విమర్శ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించాలని సూచించారు. ఇంటింటి సర్వే సందర్భంగా ప్రతి ఓటరు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరి పేర్లు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఓటర్ల నుంచి వచ్చే దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిశీలించి, నిబంధనల మేరకు పరిష్కరించాలని, ఓటరు జాబితాల నాణ్యతను మెరుగుపరచడంలో బీఎల్‌ఓలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావు లేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన ప్రతి అంశంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ప్రజలకు అవసరమైన సమాచారం అందిస్తూ ఎన్నికల ప్రక్రియపై విశ్వాసాన్ని పెంపొందించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఆర్డీవో జీవాకర్ రెడ్డి, తహసీల్దార్ రామ్ చందర్,ఎంపిడివో అలువాల శ్రీకాంత్ ఆర్ఐ లు భూమేష్, రాజేష్, సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ ఉపసర్పంచ్ గడ్డం సోమరెడ్డి, నాయకులు సందిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ముద్ధం శరత్ గౌడ్, దశరెడ్డి, రంగురామ గౌడ్, బొడ్డు రాజేష్, మాట్ల సోమయ్య ఎర్ర భూమయ్య నూతిపెల్లి రాజం సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.
