ఎస్‌.ఐ.ఆర్. ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలి

బీ.ఎల్‌.ఓ.లు విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలి: కలెక్టర్ బి.సత్య ప్రసాద్ నవగీతం, జూన్18,(జగిత్యాల ప్రతినిధి): ఎస్‌.ఐ.ఆర్. ప్రక్రియ బీ.ఎల్‌.ఓ.లకు శిక్షణ కార్యక్రమం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక సమగ్ర పునర్విమర్శ (ఎస్‌ఐఆర్) కార్యక్రమానికి సంబంధించిన బూత్ స్థాయి అధికారుల (బీఎల్‌ఓలు) శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ గురువారం పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..ఎన్నికల ప్రక్రియలో బీఎల్‌ఓల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర పునర్విమర్శ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం...