navageetam.com
Newspaper Banner
Date of Publish : 03 June 2026, 3:45 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

కొమిరెడ్డి సేవలు మరువలేనివి..

ఏడాదిలోపు రాములు, జ్యోతక్క విగ్రహాలు ఏర్పాటు చేస్తాం

కొమిరెడ్డి రాములు జయంతి వేడుకల్లో మంత్రి అడ్లూరి

నవగీతం,(మెట్ పల్లి ప్రతినిధి):

న్యాయవాదిగా, రాజకీయ నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా కోరుట్ల, మెట్ పల్లి ప్రాంత ప్రజలకు రాములు అందించిన సేవలు మరువలేని అని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు జయంతి వేడుకలు బుధవారం మెట్ పల్లి లో నిర్వహించగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ ప్రజల గుండెల్లో చిరాస్థాయిగా నిలిచిపోయే విధంగా కొమిరెడ్డి రాములు, జ్యోతక్క విగ్రహాల ఏర్పాటుకు ప్రభుత్వం తరఫున ఏర్పాటుకు సహకరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రాములు కుటుంబ సభ్యులు సూచించిన చోట వచ్చే జయంతి లోపు విగ్రహాల ఏర్పాటు ప్రభుత్వ పరంగా చేస్తామని మంత్రి తెలిపారు.స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తో పాటు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ నర్సింగరావు పర్యవేక్షణ లో విగ్రహ ఏర్పాట్ల పనులు చేయాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు. వచ్చే జయంతి లోపు విగ్రహాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి కావాలని మంత్రి అడ్లూరి అన్నారు.ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజమ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నందయ్యతో పాటు కోరుట్ల నియోజకవర్గం లోని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.