navageetam.com
Newspaper Banner
Date of Publish : 21 June 2026, 7:03 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ఘనంగా ఫాదర్స్ డే వేడుకలు

నవగీతం,ఇబ్రహీంపట్నం ప్రతినిధి:

ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బా గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఫాదర్స్ డే వేడుకలను నిర్వహించారు. ముదిరాజ్ సంఘస్తులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఫాదర్స్ డే కార్యక్రమంలో కేక్ కట్ చేసి తల్లిదండ్రులు చేసిన మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అనంతరం మత్స్య కార్మిక సొసైటీ అధ్యక్షులు సల్వల రాజేశ్వర్, గరిగే ప్రసాద్, పందెన నర్సయ్య లు పదవి విరమణ పొందడంతో సంఘ సభ్యులు వారిని ఘనంగా సన్మానించారు. అనంతరం నూతన కార్యవర్గానికి కూడా సాల్వాతో సన్మానించారు. ఫాదర్స్ డే సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో సహా పంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో డబ్బా గ్రామ ఉపసర్పంచ్ రాపల్లి మహేష్, పుప్పాల మహేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పిట్టల వంశీ, వార్డు సభ్యులు బైండ్ల విశాల్, బొజ్జ నరేందర్, బైండ్ల విశాల్, మత్స్య కార్మిక మాజీ అధ్యక్షులు సల్వాల రాజేశ్వర్, బొజ్జ పెద్ద మల్లయ్య, గరిగే నడిపి ఆశన్న,నేమూరి శ్రీనివాస్, బోండ్ల అనిల్, కస్ప గంగారం, ముదిరాజ్ సంఘ సభ్యులు మహిళలు పాల్గొన్నారు