జనగర్జన ఫలమే తెలంగాణ రాష్ట్రం – అమరవీరుల త్యాగాలకు వందనం: మంజుల పత్తిపాటి
నవగీతం, ఆలేరు ప్రతినిధి : జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకుంటూ మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల పత్తిపాటి భావోద్వేగ కవితను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో కేసీఆర్ పిలుపు ప్రతి గుండెల్లో మంటలు రేపిందని, తెలంగాణ సాధన ఆకాంక్ష పల్లె పల్లెకు విస్తరించి ప్రజా ఉద్యమంగా మారిందని ఆమె పేర్కొన్నారు. అమరవీరుల త్యాగాలు, విద్యార్థుల పోరాటాలు, మిలియన్ మార్చ్ వంటి ఉద్యమ ఘట్టాలు ఢిల్లీని కదిలించాయని,...