జాతీయ రహదారుల విస్తరణతో ఉత్తర తెలంగాణకు కొత్త ఊపు
ఎంపీ అరవింద్ అన్న కృషితో రహదారుల అభివృద్ధికి నిధుల మంజూరు నవగీతం, జగిత్యాల ప్రతినిధి : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మరో కీలక నిర్ణయం తీసుకుందని భారతీయ జనతా పార్టీ జగిత్యాల నియోజకవర్గ బాధ్యురాలు డాక్టర్ భోగ శ్రావణి తెలిపారు. ఉత్తర తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం హర్షణీయమని ఆమె పేర్కొన్నారు. ఆర్మూర్–జగిత్యాల–మంచిర్యాల జాతీయ రహదారి మరియు జగిత్యాల–కరీంనగర్ జాతీయ రహదారిని నాలుగు వరుసల...