తెలంగాణ అభివృద్ధికి బీజేపీయే ప్రత్యామ్నాయం: రాచకొండ యాదగిరి బాబు, డాక్టర్ భోగ శ్రావణి
నవగీతం, జగిత్యాల ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సోమవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు, జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జీ డాక్టర్ భోగ శ్రావణి పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అనేకమంది ఉద్యమకారుల త్యాగాలు, బలిదానాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు. అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా అధికారంలోకి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ల పాలనలో ప్రజా సంక్షేమాన్ని...