పాఠశాల అభివృద్ధికి గ్రామ సర్పంచుల కృషి అభినందనీయం
మండల విద్యాధికారి కేతిరి దామోదర్ రెడ్డి నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి: మల్లాపూర్ మండలంలో నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి మరియు విద్యార్థుల నమోదు పెంపునకు చేస్తున్న కృషి అభినందనీయమని మండల విద్యాధికారి కేతిరి దామోదర్ రెడ్డి తెలిపారు. బడిబాట కార్యక్రమం సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల్లో నూతన సర్పంచులు, పాలకవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు విద్యార్థుల చేర్పుల కోసం ప్రత్యేక శ్రద్ధ చూపుతూ గ్రామస్థులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులను ప్రోత్సహించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం హర్షణీయమన్నారు. ఈ సందర్భంగా రాఘవపేట...