ప్రభుత్వ బడిలో కుమారునికి అడ్మిషన్.. గ్రామానికి స్ఫూర్తిగా సర్పంచ్ నిర్ణయం….
కోరుట్ల రూరల్, జూన్ 17,(నవగీతం ప్రతినిధి): గ్రామ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి గ్రామ ప్రజలందరూ సహకరించాలని గ్రామ సర్పంచ్ దోడ రంజిత్ రెడ్డి పిలుపునిచ్చారు. తమ కుమారుడు ధోడ రత్నాకర్ రెడ్డి ఎం.పి.పి.ఎస్. ధర్మారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మూడవ తరగతిలో చేర్పించిన సందర్భంగా ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. ఈ నిర్ణయం కేవలం తమ కుమారుడు అడ్మిషన్ కోసమే కాకుండా, గ్రామ ప్రభుత్వ పాఠశాలపై నమ్మకాన్ని పెంపొందించి ప్రజలకు మంచి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో తీసుకున్నదని తెలిపారు. గ్రామంలోని మరింత మంది తల్లిదండ్రులు...