నవగీతం: వైరాప్రతినిధి
వైరా మండలం పుణ్యపురం గ్రామానికి చెందిన సత్య కాంత్, రేణుక దంపతులను బిఆర్ఎస్ నాయకులు మదన్ లాల్ కుమార్తె మనీషా లక్ష్మీ ఇటీవల ఖమ్మం ఆస్పత్రిలో పసి పిల్లవాడి చేతికి జరిగిన ఘటనను ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం గురించి తెలుసుకొని రేణుక ఆరోగ్య పరిస్థితిని సత్యకాంత్ ,రేణుక దంపతులను కుటుంబ సభ్యుల పరిస్థితి పిల్లవాడి ఆరోగ్య పరిస్థితి గురించి స్వయంగా వివరాను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ఘటనకు బాధ్యులైన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వమే సరైన బాధ్యత వహించి కుటుంబానికి పసి పిల్లవాడికి భరోసాగా 50 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బాధిత కుటుంబానికి తన పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. సమస్య పరిష్కారానికి అవసరమైన స్థాయిలో సహాయం అందిస్తానని భరోసా కల్పించారు. కుటుంబాన్ని ఓదార్చి ధైర్యం చెప్పారు. పరామర్శించడానికి వచ్చిన బిఆర్ఎస్ నాయకులు వారిలో సిరిపురం గ్రామ సర్పంచ్ శెట్టిపల్లి శ్రీనివాసరావు, శ్రీనివాసరావు, కిరణ్, పరుచూరి రామారావు, మేదరమెట్ల రాము కళ్యాణ్, చంద్రశేఖర్, వాకదాని గోపాలరావు, బోయినపల్లి వినయ్, వాకధాని నాగయ్య, వెంకటేశ్వర్లు, గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు పలువురు ఉన్నారు.
