365 మంది విద్యార్థులతో గడి పాఠశాల అభివృద్ధి

ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజుకు ఘన సన్మానం నవగీతం,కోరుట్ల : జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని ప్రాథమిక పాఠశాల ఎస్‌ఆర్‌ఎస్‌పీ క్యాంప్ (గడి కల్లూరు రోడ్) ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజును మండల విద్యాధికారి గంగుల నరేశం ఘనంగా సన్మానించారు.ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలపై తల్లిదండ్రుల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తూ 161 మంది నూతన విద్యార్థులను చేర్పించి, పాఠశాల విద్యార్థుల సంఖ్యను 365కు పెంచడం పట్ల మండల విద్యాధికారి ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఇది గర్వకారణమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు గంగాధర్, ఎస్....