నవగీతం,జగిత్యాల
టీయూడబ్ల్యూజే (ఐజేయు) అనుబంధ జగిత్యాల ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ఎల్లాల రాజేందర్‌రెడ్డి విజయం సాధించారు. ఆదివారం జగిత్యాల పట్టణంలోని దేవిశ్రీ గార్డెన్స్‌లో నిర్వహించిన ఎన్నికల్లో ఆయన తన సమీప ప్రత్యర్థి బైరి రాజేష్ గౌడ్‌పై 24 ఓట్ల మెజారిటీతో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఐజేయు జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎన్నికల అధికారి బెజ్జంకి సంపూర్ణ చారి అధికారికంగా ప్రకటించారు. అదేవిధంగా ప్రధాన కార్యదర్శి పదవికి కందుకూరి శశిధర్ తన ప్రత్యర్థి పన్నాల లక్ష్మారెడ్డి పై 14 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులుగా ముసిపట్ల దేవేందర్, బద్దెనపల్లి మల్లేశం, శనిగరపు శ్రీనివాస్ ఎన్నికయ్యారు. కోశాధికారిగా బోయినపల్లి శ్రీధర్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఆర్గనైజింగ్ సెక్రటరీగా కదార్ల రంజిత్, సంయుక్త కార్యదర్శులుగా బద్దం నారాయణరెడ్డి, గంటే మహేష్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా నీరటి గంగాధర్, కల్లెడ గంగాధర్ (హరీష్), ఎల్ల క్రాంతికుమార్, సామా మహేష్, వాసం రఘు, ఎండి సాబిర్, కట్కూరి సంతోష్, దిండిగల శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలు టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు పర్యవేక్షణలో జరిగాయి. ఎన్నికల అధికారులుగా జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జంకి సంపూర్ణ చారి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగుల గోపాల చారి, జిల్లా కోశాధికారి సిరిసిల్ల వేణుగోపాల్, జిల్లా ఉపాధ్యక్షులు గడ్డల హరికృష్ణలు బాధ్యతలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఐక్యతతో పనిచేసి జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు కృషి చేయాలి అని సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు సహకరించిన ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ ఎన్నికల నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

