Thursday, February 26, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలమోడీ చిత్రపటానికి పాలాభిషేకం

మోడీ చిత్రపటానికి పాలాభిషేకం

📰 Generate e-Paper Clip

నవగీతం, కథలాపూర్

రైతులకు కొత్త సంవత్సరం కానుక కిసాన్ సమృద్ధి యోజన కింద ఏటా కేటాయిస్తున్న మొత్తం రూ. 6000 నుంచి రూ.10,000  పెంచిన కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా బుధవారం చింతకుంట గ్రామంలో భారతీయ జనతా పార్టీ యువ మోర్చా నాయకులు, కార్యకర్తలు, రైతులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ ఏర్పాటు కు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో బీజెవైఎం కథలాపూర్  మండల అధ్యక్షులు ఆరే శివ కుమార్,అందె వినోద్,బోదాసు కమలాకర్, అన్నం మహేష్, కోరుట్ల రాజేష్, రవి,రాజరెడ్డి  పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular