ఎస్పీ అశోక్ కుమార్
నవగీతం, జగిత్యాల.
డిసెంబర్ 31 అర్ధరాత్రి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జగిత్యాల జిల్లా ప్రజల భద్రత శాంతి భద్రతలే మా ప్రధాన లక్ష్యమని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. ఎస్పీ మాట్లాడుతూ అనుమతి లేని వేడుకలు,ర్యాలీలు,డీజే కార్యక్రమాలు, బైక్ ర్యాలీలు పూర్తిగా నిషేధమని మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని యువత బాధ్యతా యుతంగా ప్రవర్తించాలని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై తగిన పర్యవేక్షణ వహించాలని అందరం కలిసి శాంతియుత వాతావరణంలో నూతన సంవత్సరాన్ని స్వాగతిద్దాం అని అన్నారు.

