నవగీతం,మల్లాపూర్
మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన ఏనుగు వెంకట్ రెడ్డి, గ్రామ ప్రజల ప్రయోజనాల కోసం శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్నారు. గత 2 సంవత్సరాల కాలానికి సంబంధించిన ఇంటి పన్నుల వసూళ్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధులు, వాటి ఖర్చులు,వీధి విద్యుత్ దీపాల వివరాలు, గ్రామ పంచాయతీ ఆదాయ వ్యయా లపై పూర్తి సమాచారం కోరుతూ గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ కు దరఖాస్తు అందించారు.

