టి ఆర్ టి ఎఫ్ డిమాండ్
నవగీతం, జగిత్యాల
రాష్ట్రంలో నిర్వహించనున్న టెట్ పరీక్ష ఈ సంవత్సరం పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు హాజరగుచున్నారు పరీక్ష కేంద్రాలను 300కి మీ పైచిలుకు సుదూర ప్రాంతంలో కేటాయించడం వల్ల తీవ్ర ఇబ్బంది ఉంటాయని వాటిని పున సమీక్షించి సమీప జిల్లాల్లోనే టెట్ పరీక్ష కేంద్రాలను కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి బేతి సాయికృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.పరీక్ష కేంద్రాలను సుదూర ప్రాంతాల్లో కేటాయించడం వల్ల ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదురు అవుతాయని పేర్కొన్నారు. మెజారిటీ ఉపాధ్యాయులకు ఖమ్మం, హైదరాబాద్ తదితర సుదూర ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించడం వల్ల వారు వ్యయప్రయాసలకు గురవుతారని అన్నారు. జనవరి 3 నుంచి 20 వరకు జరిగే టెట్ పరీక్షలకు ఈసారి సుమారు 70వేలకు పైగా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు హాజరవుతున్నారని ముఖ్యంగా మహిళలకు ఇబ్బంది అవుతుందని, వాహనాల్లో అక్కడికి చేరుకోవడం, ఒకరోజు ముందుగానే వసతి ఏర్పాటు చేసుకోవడం భారంగా అవుతుందని అన్నారు. ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని తక్షణమే సమీప జిల్లాల్లోనే లేదా ఉమ్మడి జిల్లాల్లోనే పరీక్ష కేంద్రాలు కేటాయించేలా పాఠశాల విద్యా శాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అదేవిధంగా పరీక్షలు రాసే ఉపాధ్యాయులకు ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు

