నవగీతం, మల్లాపూర్
మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట అంగన్వాడి కేంద్రాలను గురువారం డిడబ్ల్యుఓ నరేష్ ఆకస్మిక తనిఖీ చేసారు. ఈసందర్భంగా అంగన్వాడి కేంద్రాలకు వచ్చే పిల్లల సంఖ్య, గ్రోత్ మానిటరింగ్, ఏఎల్ఎంఎస్సీ కమిటీ మీటింగ్ రిజిస్టర్ లను తనిఖీ చేసి గర్భిణీలకు బాలింతలకు పౌష్టికాహారాల రిజిస్టర్లను కూడా తనిఖీ చేశారు. డి డబ్ల్యూ ఓతోపాటు ముత్యంపేట గ్రామ సర్పంచ్ తేలు నరేష్, ఉప సర్పంచ్ వంగ పోతయ్య, అంగన్వాడి టీచర్ ఆమేటి శ్రీలత, దాసరి లక్ష్మి, ఉన్నారు.

