Thursday, February 26, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలఅయ్యప్ప స్వాములకు ముస్లిం సోదరుడి అన్న ప్రసాదం

అయ్యప్ప స్వాములకు ముస్లిం సోదరుడి అన్న ప్రసాదం

📰 Generate e-Paper Clip

మత సామరస్యాన్ని చాటుకున్న ఖుతుబొద్దీన్ పాషా

నవగీతం, మెట్ పల్లి:

మతాలకు అతీతంగా అయ్యప్ప స్వాములకు అన్న ప్రసాదం చేశాడు ఓ ముస్లిం సోదరుడు. పట్టణంలోని అయ్యప్ప స్వామి సన్నిధానంలో అయ్యప్ప స్వాములకు, భక్తులకు అన్నదానం చేసి, అందరికి ఆదర్శంగా నిలించాడు మెట్ పల్లి పట్టణానికి చెందిన మహ్మద్ ఖుతుబొద్దీన్ పాషా పట్టణానికి చెందిన సుమారు 25 మంది స్వాములకు బిక్ష చేశారు. ఇందులో భాగంగా గురువారం ఎండి ఖుతుబొద్దీన్ పాషా అయ్యప్ప స్వాములకు అన్న ప్రసాదం స్వయంగా అయ్యప్పలకు వడ్డించి తాను భిక్షను తిని మత సామరస్యాన్ని చాటి అందరికి ఆదర్శంగా నిలిచాడు. మతాలను పక్కనపెట్టి ఖుతుబొద్దీన్ పాషా అన్నదానం చేయడం ఆనందంగా ఉందని అయ్యప్ప స్వాములు తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే అయ్యప్ప మాల ధారణ సమయంలో ముస్లిమ్ సోదరులు ఎవరో ఎకరు ముందుకు వచ్చి అయ్యప్పలకు అన్నదానం చేస్తున్నారని తెలిపారు. అయ్యప్ప స్వాములు మతసమరస్యానికి ప్రతీకగా శబరిమలై వెళ్లే ప్రతి ఒక్క అయ్యప్ప భక్తుడ ఏరిమెలిలో ఉన్న వావరు స్వామిని దర్శించుకున్న తరువాతే అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారని ఖుతుబొద్దీన్ పాషా అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అయ్యప్ప స్వామి దీక్ష భక్తులు, స్థానికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular