Thursday, February 26, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలఇందిరమ్మ చీరలతో పోచమ్మకు ‘చలిబోనాలు’

ఇందిరమ్మ చీరలతో పోచమ్మకు ‘చలిబోనాలు’

📰 Generate e-Paper Clip

నాణ్యత బాగుందంటూ మహిళల హర్షం

గత ప్రభుత్వం ఇచ్చిన చీరలు మూలన పడేశాం.

నవగీతం, మల్లాపూర్

మల్లాపూర్ మండలం లోని గొర్రెపల్లి, గుండంపల్లి గ్రామంలో ఆదివారం ఆధ్యాత్మిక సందడి నెలకొంది. గ్రామంలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన మహిళలు భక్తిశ్రద్ధలతో పోచమ్మ తల్లికి ‘చలిబోనాలు’ సమర్పించారు. అయితే ఈ వేడుకలో గుండంపల్లి సర్పంచ్ దప్పుల పద్మ గ్రామ మహిళలతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేసిన ఇందిరమ్మ చీరలను ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

పోచమ్మ దేవాలయం వద్ద అంబేద్కర్ కాలనీ మహిళలు

గత బీఆర్ఎస్ హయాంలో పంపిణీ చేసిన ‘కేసీఆర్ చీరలు’ ఏమాత్రం నాణ్యత లేవని, అవి కట్టుకోవడానికి అస్సలు పనికిరాలేదని వారు అన్నారు. నాణ్యత లేకపోవడంతో ఆ చీరలను తాము ఎప్పుడో మూలన పడేశామని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేసిన ఇందిరమ్మ చీరలు చాలా బాగున్నాయని, నాణ్యతతో పాటు రంగులు కూడా ఆకట్టుకుంటున్నాయని గొర్రెపల్లి అంబేద్కర్ కాలనీ మహిళలు కొనియాడారు. అందుకే ఈ పవిత్రమైన చలిబోనాల పండుగకు తామంతా ఇందిరమ్మ చీరలనే ధరించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నామని వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గుండంపల్లి  గ్రామ సర్పంచ్ దప్పుల పద్మ, స్నేహిత, మంజూష, సోనీ,మనమ్మ, లక్ష్మి,నాగమణి, రజిత, గొర్రెపల్లి కాలనీకి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular