Thursday, February 26, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్ఎన్‌ఆర్‌ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు

ఎన్‌ఆర్‌ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు

📰 Generate e-Paper Clip

నవగీతం,హైదరాబాద్

తెలుగుదేశం పార్టీ యువనేత, రాష్ట్ర ఐటీ , మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఎన్‌ఆర్‌ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గల్ఫ్ కౌన్సిల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ కన్వీనర్ రాధాకృష్ణ సమన్వయంతో, ఏపీఎన్‌ఆర్టీ అధ్యక్షులు డా. వెమూరి ఆధ్వర్యంలో ప్రత్యేక జూమ్ సమావేశం నిర్వహించబడింది. ఈ జూమ్ సమావేశంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు, ఎంఎస్‌ఎంఈ, ఎస్‌ఈఆర్‌పీ మరియు ఎన్‌ఆర్‌ఐ ఎంపవర్‌మెంట్ & రిలేషన్స్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొని ఎన్‌ఆర్‌ఐలతో సాన్నిహిత్యంగా మమేకమయ్యారు. అనంతరం ఎన్‌ఆర్‌ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో కేక్ కట్టింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐ టీడీపీ బహ్రెయిన్ నాయకులు రఘునాథ్ బాబు, హరి బాబు సతీష్ శెట్టి , రామ మోహన్, శివ కుమార్,సతీష్ ఇంతియాజ్ అహ్మద్,చంద్రబాబు, కిషోర్ అనిల్ నాగార్జున  వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అలాగే పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ అభిమానులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా నేతలు మహానేత స్వర్గీయ శ్రీ ఎన్‌టిఆర్ సేవలను ఘనంగా స్మరించడంతో పాటు, నారా లోకేష్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అవుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular