Friday, February 27, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలఎన్నికల నియమవళి పక్కాగా అమలు చేయాలి

ఎన్నికల నియమవళి పక్కాగా అమలు చేయాలి

📰 Generate e-Paper Clip

నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

నవగీతం,మెట్ పల్లి

మెట్ పల్లి, కోరుట్ల మున్సిపాలిటీల్లో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ బుధవారం పరిశీలించారు.ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరుగుతోందా లేదా అనే విషయాన్ని స్వయంగా పరిశీలించారు.నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

అన్ని నామినేషన్ కేంద్రాల వద్ద అన్నిరకాల ఫామ్స్ అందుబాటులో ఉండేల చూసుకోవాలని ప్రతి నామినేషన్ కేంద్రం వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని, శాంతియుత వాతావరణంలో నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లి, కోరుట్ల ఆర్డీఓలు శ్రీనివాస్, జివాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల సిబ్బంది మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular