Friday, March 6, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలకాంగ్రెస్ పాలనలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం..జువ్వాడి నర్సింగరావు

కాంగ్రెస్ పాలనలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం..జువ్వాడి నర్సింగరావు

📰 Generate e-Paper Clip

నవగీతం,మెట్ పల్లి:

కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జువ్వడి నర్సింగరావు మెట్పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక అత్యధిక అభివృద్ధి కార్యక్రమాలు మన కోరుట్ల నియోజకవర్గంలో జరిగాయని మహిళలకు ఉచిత బస్సు 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇళ్లకు రూ.5 లక్షలు నిధులు మంజూరు రూ.500 లకు సిలిండర్ సబ్సిడీ వంటి కార్యక్రమాలు ఎన్నో చేశామని అలాగే సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనలో కోరుట్ల నియోజకవర్గం చాలా అభివృద్ధి చేసామని అన్నారు. కోరుట్ల మున్సిపాలిటీలలో రూ.18 కోట్ల 70 లక్షలు మెట్ పల్లి మున్సిపాలిటీకి రూ.18 కోట్ల 70 లక్షలు మంజూరు పనులు మంత్రి ప్రారంభించారని అభివృద్ధి పనులు జరగాయని అన్నారు. రాబోవు మున్సిపల్ ఎన్నికల్లో అందరి సహకారంతో పట్టణంలోని బడుగు బలహీన వర్గాల ప్రజల ఆకాంక్ష మేరకు రెండు మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జెట్టి లింగం మండల అధ్యక్షులు తిప్పిరెడ్డి అంజిరెడ్డి మైలారం లింబాద్రి, ధ్యావనపెల్లి రాజారాం ,మాజీ జెడ్పిటిసి ఆకులు లింగారెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular