నవగీతం, జగిత్యాల
జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ప్రాంతంలో భక్తులు గిరిప్రదక్షిణ చేయడానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సోమవారం కొండగట్టు లోని రోడ్డు మార్గాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొండగట్టు ఆలయం చుట్టూ భక్తులు గిరిప్రదక్షిణ చేయడానికి కావాల్సిన ఏర్పాట్ల గురించి రెవిన్యూ, ఫారెస్ట్, ఆర్ & బి, పంచాయతీ రాజ్ మరియు సంబంధిత అధికారులతో పరిశీలించడం జరిగిందని తెలిపారు.గిరిప్రదక్షిణ కొరకు ముఖ్యంగా రోడ్డు విస్తారంగా ఉండాలని మార్గ మధ్యలో భక్తులకు త్రాగునీరు, శౌచాలయాలు, విశ్రాంత కేంద్రాలు తదితర అంశాల గురించి సంబంధిత అధికారులకు సూచించడం జరిగిందని తెలిపారు.అలాగే గిరిప్రదక్షిణ కొరకు అంచనా ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు

