Thursday, February 26, 2026
ads
Homeభక్తి - ఆధ్యాత్మికతజనవరి 16న ఎస్వీ గోశాలలో గోపూజ మహోత్సవం

జనవరి 16న ఎస్వీ గోశాలలో గోపూజ మహోత్సవం

📰 Generate e-Paper Clip

నవగీతం,తిరుపతి

తిరుపతి శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాల లో జనవరి 16న  కనుమ పండుగ సందర్భంగా గోపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా ఉదయం 5 గం.ల నుండి 10.30 గం.ల వరకు శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకం, పూజ, హారతి కార్యక్రమం జరుగనుంది. ఉదయం 10.30 గం.ల నుండి 11.15 గం.ల వరకు గోపూజ, కటమ, అశ్వ, వృషభ, గజ పూజ జరుగనుంది. తదుపరి 11.15 గం.లకు  దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులతో భజన, కోలాటాలు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో సంకీర్తన కార్యక్రమాలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుండి శ్రీవేణుగోపాలస్వామివారి దర్శనం, ప్రసాదం పంపిణీ చేస్తారు.గోపూజ మహోత్సవం రోజున గోవులకు బెల్లం, బియ్యం, గ్రాసం భక్తులు స్వయంగా తినిపించే అవకాశాన్ని టీటీడీ కల్పిస్తోంది. ఈ సదవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకుని గోమాత, స్వామివారి కృపకు పాత్రులు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular