Thursday, February 26, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలపరిసరాల పరిశుభ్రత పాటించాలి: సర్పంచ్ మామిడి రాజు

పరిసరాల పరిశుభ్రత పాటించాలి: సర్పంచ్ మామిడి రాజు

📰 Generate e-Paper Clip

నవగీతం, ఇల్లంతకుంట

ప్రతిఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటిస్తేనే ఆరోగ్యవంతంగా ఉంటారని సర్పంచ్ మామిడి రాజు అన్నారు.మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉండి మురికినీరు పేరుకుపోయి దుర్గంధం వస్తుండడంతో శుక్రవారం ఇందిరమ్మ కాలనీని సర్పంచ్ మామిడి రాజు సందర్శించి వెంటనే స్పందించి సెప్టిక్ ట్యాoకర్ తెప్పించి డ్రైనేజీలో నిలిచిన మురుగునీటి ని,వ్యర్థాలను తొలగించేలా చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకవర్గం సహాయంతో గ్రామప్రజల ఆరోగ్యం,పరిశుభ్రత పైన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తామని అందులో భాగంగా గ్రామంలోని అన్ని వాడలలో ని డ్రైనేజీలు,పరిసరాలను పరిశుభ్రం చేయిస్తామని అన్నారు.కాలనీ వాసులు మాట్లాడుతూ
కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయిన మురికి నీరు,వ్యర్థాల వలన అనేక ఆరోగ్య సమస్యలు,ఇబ్బందులు ఎదుర్కొన్నామ ని సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే తమ కాలనిలో మురికినీరు, వ్యర్థను తొలగించి తమకు ఉపశమనం కల్గించనందుకు సర్పంచ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ చంద్రశేఖర్,వార్డు మెంబర్లు రాకం సుమన్,ఎర్రోజు దీపికా రవితేజ,సిబ్బంది ఎలుక రాము,కాలనీ వాసులు తిప్పారపు శ్రీనివాస్,దాసు,చాంద్,విఠల్, రవి,ధనుంజయ్,రాజు మహిళలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular