నవగీతం,మెట్ పల్లి
బీజేపీ రాష్ట్ర నాయకులు, నిత్య సాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ చిట్నేని రఘు బుధవారం పలువురు బాధిత కుటుంబాలను పరామర్శించారు. మెట్ పల్లి బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షుడు బొడ్ల రమేష్ తండ్రి బొడ్ల చిన్న గంగారాం ఇటీవల మృతి చెందగా బీజేపీ రాష్ట్ర నాయకులు, నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ చిట్నేని రఘు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మెట్ పల్లి పట్టణంలోని వారి నివాసంలో ద్వాదశ దినకర్మ కార్యక్రమానికి హాజరై స్వర్గీయ బొడ్ల చిన్న గంగారాం చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. ఆయన మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. అదేవిధంగా మెట్ పల్లి ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సురిగి శ్రీనివాస్ ఇటీవల మాతృవియోగం చెందగా వారి కుటుంబ సభ్యులను సైతం బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ చిట్నేని రఘు పరామర్శించి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు చింతల శ్రీకర్ గౌడ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గుగ్గిళ్ళ తుకారాం గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

