Thursday, February 26, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలపెగడపల్లికి జూనియర్ కాలేజీ మంజూరు చేయాలి

పెగడపల్లికి జూనియర్ కాలేజీ మంజూరు చేయాలి

📰 Generate e-Paper Clip

డిప్యూటీ సీఎంకు మాజీ జెడ్పిటిసి తాటిపర్తి శోభారాణి వినతి

నవగీతం,జగిత్యాల

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంధ్రానికి ప్రభుత్వ జూనియర్ కాలేజీ మంజూరు చేయాలనీ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ జెడ్పిటిసి తాటిపర్తి శోభారాణి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ను కోరారు.ధర్మపురిలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన కోసం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆహ్వానం మేరకు బుధవారం డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్క రాగ ఆయనను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు పెగడపల్లి మండలంలో వివిధ పాఠశాలల్లో చదివి పదవతరగతి పాసైన విద్యార్థులు ఇంటర్మిడియేట్ చదవడానికి జగిత్యాల, మల్యాల ప్రాంతాలకు వెళ్లి చదువుకోవడం ఇబ్బందిగా ఉన్నదని, వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వచ్చే విద్యాసంవత్సరంలో జూనియర్ కాలేజీ మంజూరు చేయాలనీ డిప్యూటీ సీఎం కు మంత్రి లక్ష్మణ్ కుమార్ సమక్షంలో శోభారాణి విజ్ఞప్తి చేశారు.అలాగే కష్టకాలంలో అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, పార్టీ పటిష్టతకు పాటుపడుతున్న సీనియర్ మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లకు ప్రభుత్వ నామినేటెడ్ పదవులతో ప్రాధాన్యత ఇవ్వాలని శోభారాణి డిప్యుటీ సీఎం కు వినతిపత్రం అందజేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular