Thursday, February 26, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలప్రభుత్వ జూనియర్ కళాశాలలో బడి బాట ఆరంభం :- ప్రిన్సిపాల్ పిలుపు

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బడి బాట ఆరంభం :- ప్రిన్సిపాల్ పిలుపు

📰 Generate e-Paper Clip

నవగీతం, మెట్ పల్లి

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులు విధిగా చేరాలని, అందుకోసం కళాశాల సిబ్బంది అహర్నిశలు కృషి చేయాలని జగిత్యాల జిల్లా మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పిలుపునిచ్చారు. స్థానిక పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్వర్యంలో శనివారం రోజున స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ దేవరాం అధ్యక్షతన జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సావిత్రీ భాయి ఫూలే జయంతి వేడుకల కార్యక్రమంతో పాటు బడి – బాట కార్యక్రమం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు తప్పకుండా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోనే చేరాలని పిలుపునిచ్చారు.సంఘ సంస్కరణతో పాటు మహిళలకు విద్య అందించాలన్న లక్ష్యంతో సావిత్రీ భాయి ఫూలే చేసిన కృషి ప్రశంసనీయమని, ఆమె ఆశయాలను సాధించటానికి కృషి చేయాలని ఆయన సూచించారు. మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ ,బీ కాం. (కంప్యూటర్) కోర్సులు ఉన్నాయని, భవిష్యత్తులో ఈ కోర్సుల వల్ల ఉద్యోగావకాశాలు పొందవచ్చని  విద్యార్థులకు ప్రిన్సిపాల్ డాక్టర్ కే.వేంకయ్య హితవు పలికారు. మెట్ పల్లి డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ తొంటి దేవన్న మాట్లాడుతూ, కళాశాలలో జిజ్ఞాస, కంప్యూటర్ ల్యాబ్, విశాలమైన తరగతి గదులు వంటి అన్ని సౌకర్యాలు ఉన్నాయని, ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. సావిత్రీ భాయి ఫూలే జయంతి రోజున ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రావడం అదృష్టంగా భావిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల సిబ్బంది బి.రాజేందర్, ఏ.మనోజ్ కుమార్,అంజయ్య, శ్రీకాంత్, శ్రీనివాస్, నర్సయ్య, జగపతి, వెంకన్న, ప్రతిభ, స్వర్ణలత, మహేశ్వరి తదితరులతో పాటు విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular