ఎన్నారై దంపతులను సన్మానించిన ప్రజాప్రతినిధులు
నవగీతం,ఇబ్రహీంపట్నం:
ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం అమెరికా నివాసి తుమ్మల సతీష్ కుమార్ విజయలక్ష్మి దంపతుల సహకారంతో స్కూల్ బ్యాగులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ బాస శ్రవణ్, ఉప సర్పంచ్ సతీష్ కుమార్, ఏ ఏ పీ సి చైర్మన్ బోడ భాగ్య , మండల విద్యాధికారి బండారి మధు పాల్గొని వారి చేతులమీదుగా పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కోసం దాతలు ముందుకు రావడం చాలా గొప్ప విషయమని అన్నారు.ఈ కార్యక్రమంలో స్కూల్ బ్యాగ్స్ ని విద్యార్థులకు అందించిన దాతలు ఎన్నారై దంపతులను ప్రజా ప్రతినిధులు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గుర్రాల విజయలక్ష్మి ఉపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ హెచ్ఎం భూపతి, ఉపాధ్యాయులు వేణుగోపాల్, నరేష్, మంజునాథ్, వేదశ్రీ, అశోక్, రాజేంద్రప్రసాద్, స్వామి , భూలక్ష్మి, సుమతి, వనిత, ఉదయశ్రీ, రత్నమాల, గిరిజ తదితరులు పాల్గొన్నారు.

