నవగీతం, జగిత్యాల
జగిత్యాలలో నూతనంగా ఎన్నికైన టియూడబ్ల్యూజె (ఐజెయూ) అనుబంధ జగిత్యాల పట్టణ ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులను సహస్ర వేయి లింగాల ఆలయ కమిటీ సభ్యులు మర్యాద పూర్వకంగా ఆలయానికి ఆహ్వానించినారు. ఈ నేపథ్యంలో ఆలయంలో వేద బ్రాహ్మణుల చేత ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కార్యవర్గ సభ్యులందరికి ఆ సంఘ బాధ్యులు శుభాకాంక్షలు తెలిపి, వేద బ్రాహ్మనులచే ఆశీర్వచనాలు, స్వామి వారి ప్రసాదాలు అందించి, ఆలయ ట్రస్టీ, చైర్మన్ నలమాసు గంగాధర్, మేనేజింగ్ డైరెక్టర్ కొయ్యడ రమేష్, ట్రెజరర్ కొయ్యడ శేఖర్, కార్యవర్గ సభ్యులు తిరుపతి గౌడ్, చంద్ర శేఖర్ లు కండువాలు కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఎల్లాల రాజేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కందుకూరి శశిధర్, ఉపాధ్యక్షులు శనిగరపు శ్రీనివాస్,కోశాధికారి బోయిని పల్లి శ్రీధర్ రావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి కడార్ల రంజిత్ కుమార్, సంయుక్త కార్యదర్శి గాజుల మహేష్, కార్యవర్గ సభ్యులు నీరటి గంగాధర్, ఎల్ల క్రాంతి కుమార్, సామ మహేష్ ,కట్కూరి సంతోష్, ఎండి సాబేర్ అలీ లు పాల్గొన్నారు.

