నవగీతం, జగిత్యాల
మన మట్టి వాసనను, జానపద సంస్కృతిని తమ పాటల ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తూ, గ్రామానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన జగిత్యాల రూరల్ మండల పరిధిలోని జాబితాపూర్ గ్రామానికి చెందిన నక్క లక్ష్మిలు నక్క గంగవ్వలను గ్రామ సర్పంచ్ పోన్ శెట్టి మహేష్ ఘనంగా సన్మానించారు. వారి ప్రతిభను గుర్తించిన సర్పంచ్, గ్రామ వార్డు సభ్యులు కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచ్ ఫోన్ శెట్టి మహేష్ మాట్లాడుతూ అంతరించిపోతున్న జానపద కళలను కాపాడుతూ, మన సంస్కృతిని భావి తరాలకు అందిస్తున్న ఇలాంటి కళాకారులను గౌరవించుకోవడం మన అందరి బాధ్యతని కొనియాడారు. గ్రామీణ కళాకారుల అభివృద్ధికి తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రంజిత్ కుమార్, వార్డు సభ్యులు అరికెళ్ల నవీన, ప్రశాంత్, శెట్టి లక్ష్మి రవీందర్, మారిశెట్టి సంధ్య రాజు, ముత్తునూరి రాయమల్లు, సట్టా నరసయ్య, కందుల లాస్య శేఖర్ గౌడ్, బండారి సంజీవ్, గర్వందుల కళ్యాణి జలంధర్ గౌడ్,రాజుల గంగారాం,గ్రామ నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

