Thursday, February 26, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలమున్సిపల్ వార్డ్ రిజర్వేషన్లు శాస్త్రీయంగా రొటేషన్ పద్ధతిలో ఎటువంటి రాజకీయాలకు తావు లేకుండా చూడాలి..

మున్సిపల్ వార్డ్ రిజర్వేషన్లు శాస్త్రీయంగా రొటేషన్ పద్ధతిలో ఎటువంటి రాజకీయాలకు తావు లేకుండా చూడాలి..

📰 Generate e-Paper Clip

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ భోగ శ్రావణి

నవగీతం,జగిత్యాల

జగిత్యాల జిల్లా సమీకృత కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ కి జగిత్యాల మున్సిపల్ వార్డ్ విభజన మరియు ఓటర్ డి-లిమిటేషన్ గురించి  వార్డు సరిహద్దుల గురించి కలెక్టర్ కి వినతి పత్రం అందించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా.బోగ శ్రావణి ఈ సందర్భంగా  బోగ శ్రావణి మాట్లాడుతూ జగిత్యాల మున్సిపల్ లో 50 వార్డులను ఏర్పాటు చేయడంతో ప్రతి వార్డుకు ఒక సరిహద్దు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అదే వార్డులోని సరిహద్దు ఏర్పాటు చేసిన దానిలో ఉన్న ఇంటి నెంబర్ల ప్రకారం అదే వార్డు లో ఉండే విధంగా ఓటర్లను చేర్చాలని కోరుతున్నాం. వార్డు సరిహద్దు ఏర్పాటు చేయగా ఆ వార్డులోని ఇంటి నెంబర్ల వారీగా మరో వార్డుకి పోవడంతో అట్టి ఓటర్లను మరో వార్డుకు మార్చడం జరుగుతున్నది. వార్డ్ సరిహద్దు ఏర్పాటు చేసిన సమయంలో ఉన్న ఓటర్లను అదే వార్డులో ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చూడాలి. వార్డ్ సరిహద్దులో ఉన్న ఓటర్లు మరో వార్డుకు కలిపినట్లయితే ఆ వార్డు అభివృద్ధికి ఇబ్బంది కలుగుతుంది. కావున జగిత్యాల పట్టణంలోని ఏ వార్డులో అయిన సరిహద్దులు ఏర్పాటు చేస్తే వాటికి అనుగుణంగా ఓట్లను జతపరచాలని కలెక్టర్ కి వినతిపత్రం అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్,జిల్లా కార్యదర్శి సాంబరి కళావతి, ముద్దం రాము,దూరిశెట్టి మమత,గడ్డల లక్ష్మి, మామిడాల కవిత, సింగం పద్మ, కడార్ల లావణ్య, పిండేరు భానుప్రియ,సోమ లక్ష్మి, గదాసు రాజేందర్, కొక్కుల ధర్మేందర్,కొప్పు భాస్కర్,కుక్కల శ్రీకాంత్,నక్క జీవన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular