నవగీతం, మెట్ పల్లి
మెట్‌పల్లి మండలం బండలింగాపూర్, రాజేశ్వర్ రావుపేట జిల్లా పరిషత్ హై స్కూల్స్ ను మెట్‌పల్లి లోని నరేంద్ర జూనియర్ కళాశాలను ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ సందర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న రెండు మూడు నెలల్లో పరీక్షలు ఉన్న నేపథ్యంలో విద్యార్థులు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి, పూర్తిగా చదువుపై దృష్టి సారించాలని సూచించారు.భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమేనని, చైనా, అమెరికా వంటి దేశాలు విద్యా–సాంకేతిక రంగాల్లో వేగంగా ముందుకు దూసుకుపోతున్నాయని పేర్కొన్నారు.అలాంటి దేశాలతో పోటీ పడాలంటే మన విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదవాలని పిలుపునిచ్చారు.కులం, మతం అనే తేడాలు లేకుండా అందరూ సమానమేనని, సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడమే నిజమైన విజయం అని తెలిపారు. నేటి విద్యార్థులు నిజంగా స్వర్ణయుగంలో ఉన్నారని, తమ చదువుకునే రోజుల్లో కరెంట్ వంటి మౌలిక వసతులు కూడా లేవని గుర్తు చేశారు.ప్రస్తుతం ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని, మంచి విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు హితవు పలికారు.రానున్న పరీక్షలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపే ఉద్దేశంతో బుధవారం ప్రత్యేకంగా కళాశాలను పాఠశాలలను సందర్శించడం జరిగిందని తెలిపారు.

