గోపిడి శ్రీనివాస్ రెడ్డి
నవగీతం, మల్లాపూర్
మల్లాపూర్ మండల కేంద్రంలో మినీ క్రికెట్ స్టేడియంలో ఏర్పాటుచేసిన ఎంపిఎల్ క్రికెట్ టోర్నమెంట్ సీజన్.4 లో శుక్రవారం ఆడుతున్న ఇరు క్రికెట్ జట్టులను కలిసి టష్ వేసి మ్యాచ్ ను బిజెపి మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ యువతకు క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయని, ప్రతి యువకుడు క్రీడల వైపు ఆసక్తితో ముందుకు రావాలని సూచించారు.గ్రామాల్లోని యువత చదువుతోపాటు క్రీడలను అలవర్చుకొని ఆసక్తి చూపాలని అలాగే ఇట్టి టోర్నమెంట్ లో పాల్గొన్న ప్రతి టీం సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. విరితో నాయకులు బిట్ల నరేష్, లవంగ శివ ,బైన ప్రశాంత్ ,సతీష్, ఎం డి రఫీ,తదితరులు పాల్గొన్నారు.

