నవగీతం, మెట్ పల్లి
మెట్ పల్లి మండలం వెల్లుల గ్రామంలో యువతరానికి ఆదర్శవంతమైన నాయకుడు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన దీశాలి అని నేటి యువతరం ఆధునిక పోకడలతో వక్రమార్గం పడుతూ దుర్వ్యసనాలకు లోనవుతున్నారని గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండి శారీరక సౌష్టవాన్ని పెంచుకోవడానికి క్రీడా ప్రాంగణాల వైపు దృష్టి మళ్లించాలని మానసిక ఆందోళనతో ఆత్మహత్య చేసుకోకుండా సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్లాలని తద్వారా ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించాలని నేటి యువతరానికి స్వామి వివేకానందంగా బోధించిన బోధనలు సరిపోతాయని వారు కలలుగన్న దేశాన్ని నిర్మించాలని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఈవో సత్యనారాయణ సామాజిక కార్యకర్త విష్ణువర్ధన్ రాజు రాజా శేఖర్ రాకేష్ గణేష్ సత్తుల్ నరేష్ ఉపేంద్ర స్వామి తదితరులు పాల్గొన్నారు.

