నవగీతం, మెట్ పల్లి
మెట్ పల్లి భారత్ ఆర్ట్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో సినీ ప్రముఖుల ఆధ్వర్యంలో మీనాక్షి నృత్య కళానిలయం నాట్య గురువు నవరసనాట్యమయురి వాణి కి మరియు వారి శిష్య బృందానికి నంది పురస్కారాలని అందించడం జరిగింది. ఈ నంది పురస్కారాన్ని మీనాక్షి నృత్య కళానిలయం విద్యార్థినిలు రిత్విక, గాయత్రి, అక్షర, సన్విద, హంసిక,లయశ్రీ, వైజ్ఞానిక కి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మీనాక్షి నృత్య కళానిలయం అధ్యక్షులు గుర్రాల గంగాధర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

