Thursday, February 26, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలరాష్ట్రపతి అవార్డు గ్రహీత మణిసాయి వర్మను అభినందించిన ఎమ్మెల్యే

రాష్ట్రపతి అవార్డు గ్రహీత మణిసాయి వర్మను అభినందించిన ఎమ్మెల్యే

📰 Generate e-Paper Clip

నవగీతం, హైదరాబాద్

వేములవాడ రూరల్ మండలం నమిలిగుండు పల్లి గ్రామానికి చెందిన యువకుడు మణిసాయి వర్మను జగిత్యాల ఎమ్మెల్యే,డా సంజయ్ కుమార్ శనివారం అభినందించారు. నమిలిగుండు పల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వంగపల్లి మల్లేశం-భాగ్య దంపతుల కుమారుడైన మణిసాయి వర్మ సి యం ఆర్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశారు. చదువుకున్న రోజుల్లో నేషనల్ సర్వీస్ స్కీమ్ (NSS) స్వచ్ఛంద సంస్థలో చేరి, సమాజ సేవలో చేసిన అద్భుత కృషికి గుర్తింపుగా గత కొద్ది రోజుల క్రితం ఢిల్లీలోని రాజ్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా, అవార్డు గ్రహీత మని సాయి వర్మ శనివారం ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ని హైదరాబాద్ లోని వారి నివాసం లో  మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే డా. సంజాయ్ కుమార్ మణిసాయి వర్మను శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేశారు. యువత మణిసాయి వర్మను స్ఫూర్తిగా తీసుకొని, రాష్ట్రానికి మరెన్నో అవార్డులు తేవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అంతేకాక, రాష్ట్రపతి అవార్డు అందుకున్న మని సాయి వర్మకు మరింత ప్రోత్సాహం రాష్ట్ర ప్రభుత్వం కూడా అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular